calender_icon.png 13 December, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రలోభ పర్వం షురూ!

13-12-2025 01:57:51 AM

  1. ముగిసిన ప్రచారం.. పంపకాలు ప్రారంభం..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 574 గ్రామాల్లో ఎన్నికలు

రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం 

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు 

సంగారెడ్డి/ సిద్దిపేట/మెదక్ డిసెంబర్ 12 (విజయక్రాంతి):మొదటి దశ ఎన్నికలు ప్ర శాంతంగా ముగియడంతోపాటు రెండవ ద శ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. రాత్రికి రాత్రే ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అ భ్యర్థులు ప్రలోభాలను ప్రారంభించారు. అ భ్యర్థులు మద్యం, డబ్బు పంచెందుకు పోటీపడుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. మొదటి దశ ఎన్నికల ఫలితాలను రెండవ వి డత సమీప గ్రామాలలో గెలుపొందిన పార్టీ అభ్యర్థులను ఆయా పార్టీల అభ్యర్థులు ఉదాహరణగా చూపుతూ ప్రచారాలు చే సుకున్నారు.

అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు దీటుగా స్వతంత్ర అభ్యర్థులు ప్రలోభా లతో ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమలు చేసే అధికారులు, పో లీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నప్పటికీ అభ్యర్థులు వారి కంటికి చిక్కకుండా ఓటర్లను తమ వైపు మ లుచుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నా లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారుల కను లు గప్పి అభ్యర్థులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు, చీరలు, అభ్యర్థుల గుర్తులను వస్తురూపంలో పంపిణీ చేస్తూ ఎన్నికల నిబం ధనలను విస్మరిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆ రోపణలు వినిపిస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం పకడివందేగా పర్యవేక్షిస్తున్నా మంటూ సూచిస్తున్నారు. రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు అధికారు లు వెల్లడించారు. సిద్దిపేట, మెదక్, సంగారె డ్డి జిల్లాలోని సమస్యత్మకమైన పోలింగ్ కేం ద్రాలలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పోలీస్ జిల్లా అధికారులు వెల్లడించారు. 

సిద్దిపేట జిల్లాలో... 

సిద్దిపేట జిల్లాలోని 10 మండలాలలో 182 గ్రామపంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులకు, 1644 వార్డు సభ్యులకు రెండవ విడ త ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హైమావతి, జిల్లా పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ లు ఎన్నికలు జరగనున్న గ్రామాలలో పర్యటించి పకడ్బందీ చర్యలు చేపట్టారు. 

సంగారెడ్డి జిల్లాలో...

సంగారెడ్డి జిల్లాలో రెండో విడత ఎన్నికలు ప్రచారానికి తెరపడింది. రెండో విడత లో జిల్లాలోని ఆందోల్, చౌటకూర్, ఝరాసంగం, కొహిర్, మొగుడంపల్లి, మునిపల్లి, పుల్కల్, రాయికోడ్, వట్పల్లి, జహీరాబాద్ మండలాల్లో ఈనెల 14న ఎన్నికలు జరగనున్నాయి.

రెండవ విడతలో భాగంగా పది మండలాల్లోని 243 సర్పంచ్ స్థానాలు, 2,164 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే 14 సర్పంచ్, 222 వార్డు స్థా నాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 229 పంచాయతీలకు సర్పంచ్, 1,941 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 5,154 మంది బరిలో ఉన్నారు. 

మెదక్ జిల్లాలో....

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నిక లు మెదక్ జిల్లాలో 8 మండలాల్లో ఈనెల 14న జరగనున్నాయి. జిల్లాలోని చేగుంట, మనోహరాబాద్, మెదక్, నార్సింగి, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, తూప్రాన్ మండలాల్లోని 149 పంచాయతీ లు, 1,290 వార్డులు ఉన్నాయి.

ఇప్పటికే 7 పంచాయతీలు, 256 వార్డులు ఏకగ్రీవం కా గా మిగిలిన 142 సర్పంచ్ స్థానాలకు 534 మంది అభ్యర్థులు, 1,034 వార్డులకు 2,66 6 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయి తే మనోహరాబాద్ మండలంలోని రెండు వార్డులు మినహా మిగతా వాటికి ఎన్నికలు జరగనున్నాయి.