17-12-2025 12:00:00 AM
ములకలపల్లి, డిసెంబర్ 16,(విజయక్రాంతి):ములకలపల్లి మండలం వి.కే రా మవరం సర్పంచ్ గా గెలిచిన ఊకె ఆదిలక్ష్మి బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మె ల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్ బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లును మంగళవారం దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి తాటి వెంక టేశ్వర్లు స్వీట్ తినిపించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలక్ష్మి గెలుపులో కీలక పాత్ర పోషించిన తాటి రవి, ఊకే అశోక్, బొర్రా సుధాకర్, వగ్గేల నవీన్ ను అభినందించారు.