calender_icon.png 17 December, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే : ప్రవీణ్

17-12-2025 12:00:00 AM

తంగళ్ళపల్లి, డిసెంబర్ 16(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జంగం ప్రవీణ్ మాట్లాడుతూ, కేటీఆర్ అభద్రత భావంతో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సర్పంచ్ల సమస్యలను పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు లీగల్ సెల్ గురించి మాట్లాడటం విడ్డూరమని అన్నారు.

తంగళ్లపల్లి మండలంలోని 10 గ్రామపంచాయతీలలో కాంగ్రెస్ విజయం ప్రజాపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. మూడో విడత ఫలితాలు కూడా కాంగ్రెస్కు అనుకూలంగానే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరళ్ల నర్సింగ్ మార్కెట్ డైరెక్టర్ పొన్నాల పరుశురాం, జిల్లా నాయకులు లింగాల భూపతి, సత్తు శ్రీనివాస్ రెడ్డి, కట్కం రాజశేఖర్, గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్, మునిగల రాజు, చుక్క శేఖర్, సుద్దాల శ్రీనివాస్, మిరియాల శ్రీనివాస్, ప్రశాంత్, గుగ్గిల భరత్, ప్రశాంత్, జనార్దన్ రెడ్డి, పయ్యావుల , తదితరులు పాల్గొన్నారు.