29-12-2025 08:54:41 PM
హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2026 – 27 విద్యా సంవత్సరానికి నిర్వహించు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టీజీ ఎడ్ సెట్ – 2026 కు కన్వీనర్ గా, వరంగల్, కాకతీయ యూనివర్సిటీ, భౌతిక శాస్త్ర విభాగ ఆచార్యులు ఆచార్య బి.వెంకట్రాం రెడ్డిని నియమిస్తూ, తెలంగాణ కౌన్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆచార్య వి.బాలకిష్టా రెడ్డి ఉత్తర్వులు జారి చేసారు. 2025 సంవత్సరానికి కుడా ఆచార్య వెంకట్రాం రెడ్డి ఎడ్ సెట్ కన్వీనర్ గా వ్యవహరించారు. పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు ఆచార్య వెంకట్రాం రెడ్డిని అబినందించారు.