01-05-2025 12:50:00 AM
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 30: కుత్బుల్లాపూర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ లో ని సత్ జ్ఞాన్ హై స్కూల్ విద్యార్థులు పది ఫలితాలలో ప్రభంజనం సృష్టించి తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకోని అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
పది ఫలితాలలో 582 మా ర్కులతో డి.శరద్యుతి ప్రథమ స్థానం కైవసం చేసుకోగా,574 మార్కులతో ప్రతిమా దేవి ద్వితీయ స్థానం, 570 మార్కులతో శ్రీష్టిజ తృతీయ స్థానం, 567 మార్కులతో కే భవ్య శ్రీ నాలుగో స్థానం, 563 మార్కులతో తన్విష్ రెడ్డి ఐదో స్థానం, 559 మార్కులతో పి సంజన ఆరో స్థానం, 554 మార్కులతో కే యశ్వంత్ ఏడో స్థానం, 552 మార్కులతో కృషికా మిశ్రా ఎనిమిదో స్థానం, 551 మార్కులతో కే వెన్నెల తొమ్మిదవ స్థానం కైవసం చేసుకున్నారు.
అంతేకాకుండా 500 పై గా మార్కులు 61 మంది విద్యార్థులు సాధించి పాఠశాల చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చు కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లయన్ చింతల మల్లేశం మాట్లాడుతూ విద్యార్థుల అకుంఠిత దీక్ష ఉపాధ్యాయుల అంకితభావం తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఇంతటి అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుతూ తమ అద్భుతమైన విజయాన్ని అందరితో పంచుకోని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.