calender_icon.png 1 May, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగులాంబ దేవస్థానం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలి

01-05-2025 12:48:52 AM

కలెక్టర్ బి.యం.సంతోష్

గద్వాల, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జోగులాంబ దేవస్థానం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతోపాటు అన్ని అంశాలకు అంచనాలు సిద్ధం చేసి,వాటిని కార్యరూపంలోకి తేవాలని జి ల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, దేవస్థాన అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పర్యవేక్షణ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆర్కిటెక్ట్ శ్రీలేఖ దేవస్థానం అభివృద్ధిపై పలు డిజైన్ ప్రతిపాదనలు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని భక్తులకు ఆధునిక సౌకర్యాలతో పాటు, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.దేవస్థానానికి సంబంధించి దిశాని ర్దేశక బోర్డులు చారిత్రక ప్రాధాన్యతను ప్రతిబింబించేలా, పెద్ద అక్షరాలతో ఆకర్షణీయంగా రూపొందించేల, అంచనాను సి ద్ధం చేసి ఒక వారంలోపుగా ఆర్ అండ్ బి శాఖకు అందించాలని అన్నారు.

పుల్లూర్ జంక్షన్, అలంపూర్ చౌరస్తాలో శక్తిపీఠం మాన్యుమెంట్ను రూపకల్పన చేసి,తక్కువ నిర్వహణతో ఉండే ల్యాండ్స్కేపింగ్,రైలింగ్ కోసం అంచనాలు సిద్ధం చేయాలని  సూచించారు. బస్ స్టాప్ ప్రజెంటేషన్లో చూపిన డిజైన్ ప్రకారమే నిర్మాణం, ఖర్చు అంచనాతో  అమలు చేయాలన్నా రు.ఆలయానికి వెళ్లే రహదారి అభివృద్ధి, సంగమేశ్వర, పాపనాశి ఆలయాలకు వెళ్లే అప్రోచ్ రోడ్లకు తగిన అంచనాలను సిద్ధం చేసి, నిర్మాణాన్ని దేవాదాయ శాఖ ద్వారా అమలు చే యాలని అన్నారు.

సంగమేశ్వర ఆలయంలో పచ్చదనం పెం పుదల, ల్యాండ్స్కేపింగ్కు అవసరమైన చర్యలు తీసుకోవాలని పురావస్తు శాఖను సూచించారు.పచ్చదన సంరక్షణకు నీటి సరఫరా, తాగునీటి ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.ప్రతీ అంశానికి తగిన విధంగా ఖర్చు అంచనాలను సిద్ధం చేసి సంబంధిత శాఖలకు అందజేసి, వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాల ని అధికారులకు ఆదేశించారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు,ఆర్కిటెక్ట్ సూర్య నారాయణ మూర్తి, ఆర్కిటెక్ శ్రీలేఖ, కేంద్ర పురావస్తు శాఖ అధికారి రోహిణి పాండే, ఏడీ ఆర్కియాలజీ నాగలక్ష్మి, ఈ.ఓ పురేందర్, మున్సిపల్ కమిషనర్ చంద్ర శేఖర్ రావు, విద్యుత్ శాఖ ఎస్.ఈ. తిరుపతి రావు, ఆర్ అండ్ బి ఈ.ఈ ప్రగతి పాల్గొన్నారు.