26 February, 2026 | 2:14 AM

కరెంట్ షాక్‌తో రైతు మృతి

26-02-2026 12:21 AM

మునిపల్లి, ఫిబ్రవరి 25 : విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన మునిపల్లి మండలంలోని మొగ్దుంపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మొగ్దుంపల్లి గ్రామానికి చెందిన ఎండి జమీల్ (40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే రోజు మాదిరిగానే గ్రామ శివారులో గల తన పంట పొలానికి నీళ్లు పెట్టేందుకు బుధవారం వెళ్లాడు. ప్రమాదవశాత్తు పంటకు పారుతున్న నీరుకు కరెంట్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫరీన్ ఫాతిమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపారు.