26 February, 2026 | 5:56 AM

ఈఎన్సీ అడ్మిన్‌గా శ్రీనివాస్

26-02-2026 12:22 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : సాగునీటి రంగంలో కీలకమైన ఇంజినీర్ -ఇన్ -చీఫ్ (అడ్మిన్)గా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయ నకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ నీటి పారుదల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కామారెడ్డిలో ఇంజినీర్ -ఇన్- చీఫ్‌గా పనిచేస్తున్న థమటం శ్రీనివాస్‌ను ఈఎన్సీ (అడ్మిన్)కి అ దనపు బాధ్యతను అప్పగించింది. పరిపాలనా అవసరాలు, శాఖలో ఖాళీ ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉం చుకొని ఈ నియామకాన్ని వెంటనే అమలు చే యాలని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వ రకు శ్రీనివాస్ ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు.