30 June, 2026 | 1:43 AM

ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు

30-06-2026 12:00 AM

ఉచితంగా పూజా సామగ్రి పంపిణీ చేసిన ట్రస్ట్

మణికొండ, జూన్ 29 (విజయక్రాంతి) : భక్తులకు ఉచితంగా పూజా సామగ్రిని అం దిస్తూ సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వ హించినట్లు విఆర్ 4 సహయోగ్ చారిటేబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అందే లక్ష్మణ్ రావు తెలిపారు. పౌర్ణిమ సోమవారం పురస్కరించుకుని అలకాపూర్లోని తుల్జారామ్ భాగ్ ఆలయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టారు. ఆలయ పూజారి మండువ మధుసూదన్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజ లు జరిగాయి.

గణపతి పూజ, అమ్మవారి కుంకుమార్చనతో పాటు విశేష ధాన్యాలతో నవగ్రహ, అష్టదిక్పాల పూజలను వినూత్న రీతిలో నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ వ్రతకల్ప మహోత్సవాన్ని భక్తిశ్రద్ధ లతో పూర్తి చేశారు. వ్రతాల అనంతరం పూ జలో పాల్గొన్న భక్తులతోపాటు, ఆలయానికి విచ్చేసిన వారందరికీ విఘ్నేశ్ మహారాజ్ మార్గదర్శనంలో అన్నప్రసాద వితరణ చేశా రు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సుమనలిని, హరీ హారనాథ రెడ్డి, నూకల మంజూ, బొడ్డు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.