calender_icon.png 6 September, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ మనువాదుల రాజకీయ కుట్రలే

06-09-2025 01:06:56 AM

ఎస్సీ వర్గీకరణ సమితి జాతీయ చైర్మన్ వడ్లమూరి కృష్ణస్వరూప్

ముషీరాబాద్, సెప్టెంబర్ 5(విజయక్రాంతి): వర్గీకరణను తక్షణమే రేవంత్ రెడ్డి రద్దు చేయకపోతే  తిరుగుబాటు తప్పదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ కమిటీ చైర్మన్, దళిత బహుజన పార్టీ  జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ హెచ్చరించారు.

ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సమితి కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి భాగస్వామ్య సంస్థల ప్రతినిధుల తెలంగాణ రాష్ట్ర సమావేశం జరిగింది. వర్గీకరణ ను రద్దు చేయడానికి భవిష్యత్ కార్యాచరణను రూపొందించు కోవడం జరిగింది.

సెప్టెంబర్ 15 నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదు ట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించాలని  కలెక్టర్ లకు వినతి పత్రం అందిం చాలన్నారు. అక్టోబర్ 6 వ తేదిన నుండి మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ప్రజా ప్రతినిధుల క్యాంప్ కార్యాలయం వద్ద ఆం దోళన చేపట్టాలని పిలుపు నిచ్చారు. 

డిసెంబర్ నెలాఖరున ఛలో హైదరాబాద్ సచివా లయం వద్ద ఆందోళన పోరాటం కార్యక్రమానికి  రాష్ట్రంలోని 58 ఎస్సీ కులాల ప్రజలు (దళిత) సిద్ధం కావాలని పిలుపు ఇస్తూ సమితి సమావేశం తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయక పోతే మెజారిటీ దళిత ప్రజలకు భవిష్యత్ లేదని బానిసత్వం తప్పదని వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపు ఇచ్చారు.

వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,   బీజేపీ మంద కృష్ణ మాదిగతో కుమ్మ క్కైన మాల మంత్రులు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గీకరణను అసెంబ్లీ లో చట్టం చేయడానికి మాల ప్రజా ప్రతినిధులే సహకరించి మాల లకు 58 ఎస్సీ కులాల ప్రజలకు తీరని ద్రో హం చేశారని మాల జాతికి వెన్నుపోటు పొడిచారన్నారు. ఇలాంటి జాతి ద్రోహులకు తెలంగాణ లో తగిన బుద్ధి చెప్పాలని కృష్ణ స్వరూప్ పిలుపు ఇచ్చారు.

ఈ సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షు డు ప్రొఫెసర్ డాక్టర్ వీఎల్ రాజు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జె. ఎన్. రావు, రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అశోక్, వంచిత్ బహుజన్ అఘాడి,  వీబిఎ నాయకులు సంపత్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మద్దెల రాయప్ప, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్స్ ఫోరమ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రాజలింగం, 

తెలంగాణ బేగరి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పీ.  సుచంద్ర, తెలంగాణ రాష్ట్ర నేతకాని మహర్ కుల సంగం  అధ్యక్షులు గంధం శంకర్, దళిత బహుజన పార్టీ  డిబిపి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు బత్తుల సత్యనారాయణ,  గ్రేటర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పరి  సుబ్బారావు పాల్గొన్నారు.