06-09-2025 01:00:00 AM
పూజలో పాల్గొన్న కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
ముషీరాబాద్, సెప్టెంబర్ 5(విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి లోని వివేక్ నగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని శుక్రవారం కేంద్ర ప్రభుత్వ బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు పూసరాజు, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు టీ.గోపాల్, రమేష్ రామ్, రత్న సాయి చంద్, శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, శివ కుమార్, వాణి శాస్త్రి, సురే ష్ రాజు, ఆనంద్ రావు, సాయి కుమార్, సత్యం, నీరజ్, రఘు, మండపం నిర్వాహకు లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.