26-07-2025 12:00:00 AM
నిజామాబాద్ జులై :(విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మెస్ బకాయిలు, స్కాలర్‌షిప్ లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ, పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ఫీజు రియంబ ర్స్‌మెంట్ రాకపోవడంతో విద్యా ర్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కొన్ని పాఠశాల యజమాన్యాలు విద్యార్థులకు తీసి ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపించారు. పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుపై దృష్టి సాధించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకా యలు విడుదల కాకపోవడంతో విద్యార్థుల నుంచి కళాశాలలు డబ్బులు వసూళ్లకులకు పాల్పడు తున్నారని విద్యార్థుల ఆందోళనకర పరిస్థితి నెలకొందన్నారు. స్కాలర్‌షిప్‌లు అందని కారణంగా కళాశాల యాజమాన్యాలు ఫీజుల వసూళ్లకు పాల్ప డుతున్నాయని నాయకులు ఆరోపించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ కంఠేశ్వర్ జోనల్ ఇన్‌ఛార్జి దుర్గాదాస్, మహేష్, ప్రణీత్, సిద్దు, ప్రేమ్, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.