26-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 25(విజయక్రాంతి): గ్రామ పాలన అధికారుల స్క్రీనింగ్, లైసెన్సుడ్ సర్వేయర్ల అరత పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించా లని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 27న నిర్వహించనున్న గ్రామ పాల న అధికారుల స్క్రీనింగ్, లైసెన్సుడ్ సర్వేయర్ల అర్హత పరీక్షను జిల్లా కేంద్రంలోని జనకాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని,
గ్రామ పాలన అధికారులకు ఉదయం 10 నుంచి ౧ గంట వరకు, లైసెన్సుడ్ సర్వేయర్లకు 2 సెషన్లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు, మధ్యా హ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సంబంధిత శాఖల అధికా రులు సమన్వయంతో పనిచేసే పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, విద్యుత్ శాఖ ఎస్. ఈ. శేషరావు, డిపో మేనేజర్, మున్సిపల్ కమిషనర్ గజానన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ ఆసుపత్రి ఆవరణలో వైద్య విద్యార్థులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యత కొరకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్క లు నాటి పరిరక్షించాలని, వన మహోత్సవం కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాము లు కావాలని కలెక్టర్ అన్నారు.
అనంతరం ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించి తరగతి గదులు, విధ్యా బోధన విధానం, విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.
విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలు అడిగి వారి పఠన సామర్థ్యాలను పరీక్షించారు. ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకుడు డా. ప్రవీణ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి ఉదయ్‌బాబు, విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.