calender_icon.png 26 July, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరులందరికీ ప్రభుత్వ పథకాలు

26-07-2025 12:00:00 AM

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ 

జన్నారం, జూలై 25 : అరులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోనీ జ్యోతి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్, తహసీల్దార్ రాజ్ మనోహర్ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉమర్ షరీఫ్‌లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ -సేవా కేంద్రాల ద్వారా నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో అర్హులైన లబ్ధిదారులకు 2 విడతలలో రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 18 వేల వరకు రేషన్ కార్డుల దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు.

జన్నారం మండలంలో 1,847 నూత న రేషన్ కార్డులు జారీ చేయడం జరిగిందని, 722 మంది సభ్యులను రేషన్ కార్డులలో చేర్పించడం జరిగిందని తెలిపారు. అంతకుముందు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారితో కలిసి సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్ లను పరిశీలించారు.

ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం అయినందున అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.