టీచర్లు కావాలని బడికి తాళం
07-08-2026 12:41 AM
ఎర్రుపాలెం, ఆగస్టు 6( విజయక్రాంతి): మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. బయాలజీ, సోషల్ ఉపాధ్యాయులు లేకపోవడంతో గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఉన్నత పాఠశాల గేట్లకు తాళం వేసి ఆందోళన నిర్వహించారు. దీనిపై జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌కు, డీఈవో, ఎంఈవోలకు వినతిపత్రాలు అందించామని గ్రామస్థులు తెలిపారు. ఉపాధ్యాయులు నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు.






