10-05-2025 12:05:32 AM
చేవెళ్ల, మే 09: చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం ‘బడి బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.
ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ నాణ్య మైన విద్య అందించడంలో విఫలమవుతున్నాయని, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుంటున్నారని వెల్లడించారు. నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.