calender_icon.png 17 May, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

’రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల’తో ఎంతో ఉపయోగం

10-05-2025 12:04:28 AM

- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రాజేంద్రనగర్, మే 9: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంతో అన్నదాతలకు ఎంతో ఉపయోగమని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.శంషాబాద్ మండలం జూకల్ గ్రామంలో ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ’రైతు ముగిట్లో శాస్త్రవేతలు’ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా రూపొందించిన రైతు ముగిట్లో శాస్త్రవేతలు కార్యక్రమం అన్న దాతలకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు.  ఆరుగలం కష్టపడి పనిచేసే రైతన్నకు సాగుపై అవగాహన ఉంటే ఎంతో మేలు కలుగుతుందన్నారు. మన ముంగిటికే శాస్త్రవేత్తలు వచ్చి పంటలు ఎలా పండించాలి, అధిక దిగుబడి ఎలా తీసుకురావాలి అనే అనే అంశాలపై అవగాహన కల్పించడం ఎంతో సంతోషం అని తెలిపారు.

రైతులు నిరంతరం శాస్త్రవేత్తలు చెప్పిన సూచనలు పాటిస్తూ మేలు రకమైన పంటలు పండిస్తూ అధిక దిగుబడి సాధించాలన్నారు. ఈ కార్యక్రమం లో డిఎఓ నర్సింహా రావు, ప్రోగ్రాం ఇంచార్జి వాణి, ఎడిఎ కవిత, మాజీ జడ్పీటీసీ తన్వి రాజు, పలువురు రైతులు, నాయకులు పాల్గొన్నారు.