17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

17-05-2025 12:00 AM

అశ్వారావుపేట. మే 16, (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట మండలం లోని ఆసుపాక గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. స్థానిక వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త, డాక్టర్ స్రవంతి వానాకాలం సాగుకు సమాయత్తం కావటానికి అనుగుణంగా వేసవి దుక్కులు, రసాయాన ఎరువుల వినియోగం, పంట మార్పిడి, మిల్స్   డ్రిప్ వాడడాన్ని విధానాన్ని  వివరించారు.

నూతన యంత్రాల గురించి, వ్యర్థపదార్థాలను ఎరువుగా మార్చడం గురించి రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులను సిఫారసు చేసిన మేరకు వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని, వరి, పంటలో, పత్తి, పంటలలో ఆశించే చీడ పీడల నివారణ గురించి డాక్టర శ్రీలత వివరించారు. సేంద్రీయ ఎరువులైన పచ్చిరొట్ట ఎరువుల గురించి, జీవన ఎరువుల ప్రాముఖ్యత వివరించారు.

విత్తన రశీదులను భద్రపరచాలని అవగాహన కల్పించారు. మండల వ్యవసాయాధికారి కె. శివ ప్రసాద్ మట్టి నమూనాలను సెకరించే పద్దతి గురించి వివరించారు. మునగ పంట, ఫాం పాండ్ల ప్రాముఖ్యత గురించి తెలిపారు . వ్యవసాయ విస్తరణ అధికారి వివిధ పథకాల గురించి ఏ ఈ ఒ రవింద్ర గా తెలిపారు. వేటూరి స్వర్జన స్వప్న పశువుల పెంపకం గురించి వివరించారు. ఈ కార్యక్ర మంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు.