17 April, 2026 | 11:17 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

జిల్లాలో 2.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు విజయవంతం

17-05-2025 12:00 AM

 కలెక్టర్ ఎం హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి మే 16 ( విజయ క్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 2.37 లక్షల మెట్రిక్ టన్నుల కొను గోళ్లు విజయవంతంగా పూర్తి చేయగలిగామని రానున్న పక్షం రోజుల్లో సుమారు ఒక లక్ష టన్నులపైగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

యాసంగి 2024-25 వరి ధాన్యం కొనుగోళ్ల తీరుపై  రాష్ట్ర మంత్రుల బృందం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది . చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు  పౌరసరఫరాల కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు పౌరసరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి,  వ్యవసాయ శాఖ  తుమ్మల నాగేశ్వరరావు , కార్మిక రోడ్డు రవాణా శాఖ  పొన్నం ప్రభాకర్ లు , రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు తీరును జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా నుండి అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ సీజన్ కు సంబంధించి ఇప్పటికే 452 కోట్ల రూపాయలను రైతుల  ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు.  అకాల వర్షాల దృష్ట్యా , ఇంకా ఎక్కువ ధాన్యం కుప్పలు ఉన్న కేంద్రాలను గుర్తించి,  ఆయా కేంద్రాలకు ప్రత్యేక అధికారులను నియమించి కొను గోళ్లను త్వరితగతిన చేపడుతున్నామన్నారు వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి  , జిల్లా పౌరసరఫరాల  శాఖ అధికారి,  రోజారాణి , పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణ , డి ఆర్ డి ఓ నాగిరెడ్డి , డి సి ఓ మురళి , డి ఏ ఓ గోపాల్ , జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత ఇతర అధికారులు పాల్గొన్నారు.