13-09-2025 07:11:55 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడువాయి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో శనివారం యూరియా ఎరువు కోసం రైతులు పడిగాపులు కాశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం నిరీక్షించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు అవసరమైనంత యూరియా ఎరువు సరఫరా చేయడంలో విఫలమవుతుందని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రైతులకు సరిపోయే యూరియా ఎరువు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఒక్కరోజు రైతులకు 220 బస్తాల యూరియాను అధికారులు అందించారు. ఈ రెండు వందల ఇరవై బస్తాలు ఎక్కడ సరిపోతదని రైతులు ప్రశ్నించారు.