calender_icon.png 13 September, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర శిక్షా ఉద్యోగులకు సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

13-09-2025 07:09:48 PM

సిఎంకు ప్రామిస్ డేను గుర్తు చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు

నిజామాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రెగ్యులరైజ్ చేస్తానని ఇచ్చిన హామీ నేటికీ నెరవేర్చలేదని, రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కే రాజు మన ఉపేందర్ ఆరోపించారు. 

తెలంగాణ సమగ్ర శిక్ష శనివారం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యంగా హనుమకొండ ఏకశిలా పార్కు వేదికగా సెప్టెంబర్ 13 2023 రోజున ముఖ్యమంత్రి  అప్పటి పిసిసి అధ్యక్షుని హోదాలో వంద రోజుల్లో మా ప్రభుత్వం  అధికారంలోకి వస్తుంది అప్పుడు మిమ్మల్ని సగౌరవంగా పిలిచి  సచివాలయం వేదికగా చాయ్ తాగే లోపు జీవో ఇచ్చి రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చి నా తర్వాత హామీని విస్మరించడం బాధాకరమని వారన్నారు. సెప్టెంబర్ 13 శనివారం రోజును పాము సీఎం ప్రామిస్ డే గా భావిస్తూ ముఖ్యమంత్రి కి ఓసారి గుర్తు చేస్తున్నామని పేర్కొన్నారు . 

అంతేకాకుండా  విద్యావ్యవస్థలో కష్టపడి పని చేస్తున్న సరైన వేతనాలు లేక ఉద్యోగ భద్రత లేక తీవ్రమైన ఇబ్బందుల పాలవుతున్నామని గత సంవత్సరం నిర్వహించిన సమ్మె విరమణ హామీలను గౌరవ ప్రభుత్వ పెద్దలు ఆర్థిక అంశాలుగా విభజించి ఆర్థిక అంశాలను మూడు నెలల్లో ఆర్థికేతరా అంశాలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి సమ్మె విరమింప చేసిన కేవలం రెండు మూడు అంశాలు మినహా అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు చూపలేదని తక్షణమే ప్రభుత్వ పెద్దలు ప్రజాప్రతినిధు లు వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆరోగ్య కార్డు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని సమ్మె విరమణ ఒప్పందాలను అమలుపరచాలని వారు కోరారు.