13-09-2025 07:12:50 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ కోసికి నిర్మల్ జిల్లాలో అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం స్థానిక విశ్రాంతి భవనంలో జిల్లాకు చేరుకున్న న్యాయమూర్తికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి తదితరులు స్వాగతం పలికి పూల మొక్కలను అందించారు.