calender_icon.png 10 December, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల విధులలో అలసత్వానికి తావు కల్పించకూడదు

09-12-2025 12:00:00 AM

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్, డిసెంబర్ 8 (విజయ క్రాంతి): ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉండే ఎన్నికల విధులను జాగరూకతతో నిర్వహించా లని, ఏ దశలోనూ అలసత్వానికి తావు కల్పించకూడదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై ఎం.పీ.డీ.ఓలు, ఎం.పీ.ఓలు, రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.

మొదటి, రెండవ, మూడవ విడత ఎన్నికలలో చేపట్టాల్సి ఉన్న వివిధ ప్రక్రియలకు సంబంధించి తీసుకోవా ల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అన్ని దశలలోనూ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేలా కృషి చేయాలని అన్నారు. అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, పరిశీలించాల్సిన విషయాలపై ఒక్కో అంశం వారీగా కలెక్టర్ అవగాహన కల్పిం చారు.

పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా, ప్రశాం త వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఇదివరకు కూడా ఎన్నికల విధులు నిర్వర్తించాం కదా అనే భావనతో ప్రస్తుత ఎన్నికల విధులను తేలికగా తీసుకోకూడదని, ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని జాగ్రత్తలు సూచించారు. ఎవరైనా విధుల పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తూ నిర్లక్ష్యానికి తావిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

మూడవ విడత ఎన్నికలకు సంబంధించి 9న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందని, తదనంతరం వెంటనే సర్పంచ్, వార్డు స్థానాలకు బరిలో ఉన్న అభ్యర్థులతో కూడిన బ్యాలెట్ పత్రాలను ముద్రించేలా జాగ్రత్త వివరాలు పంపాలని ఆదేశించారు. మొదటి విడతగా ఈ నెల 11న పోలింగ్ జరిగే మండలాల్లో ఫొటోలతో కూడిన ఓటరు స్లిప్పులు పక్కాగా పంపిణీ జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, పక్కాగా నిబంధనలు పాటించాలని అన్నారు.       అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకు మార్, డీ.ఆర్.డీ.ఓ సాయాగౌడ్, డీ.పీ.ఓ శ్రీనివాస్ రావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.