3 July, 2026 | 11:14 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

సికింద్రాబాద్ జోన్ కార్పొరేటర్ల సమావేశం

31-05-2025 12:00 AM

- వానకాలంలో తీసుకోవల్సిన జగ్రత్తలపై చర్చ

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కార్పొరేటర్లతో వానకాల అత్యవసర సన్నాహక సమావేశం శుక్రవారం జరిగింది. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

అధికారులు, కార్పొరేటర్లు వానకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యలు వివరించారు. అత్యవసర రోడ్ల మరమ్మత్తు, ప్రాధాన్యత, నాళాల వద్ద పరిశు భ్రత తదితర అంశాలపై చర్చించారు. డిప్యూటీ మేయర్ క్రమశిక్షణతో పాటు సమగ్ర అభివృద్ధి కోసం సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు.

లోతట్టు ప్రాం తాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న నాలా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.