16 June, 2026 | 4:13 AM

ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర కీలకం

16-06-2026 02:45 AM

మంత్రి శ్రీధర్ బాబు నేషనల్ టాలెంట్ హంట్’ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి

జూన్ 15(విజయ క్రాంతి)ఏఐసీసీ, టీపీసీసీ  మీడియా కమ్యూనికేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ‘నేషనల్ టాలెంట్ హంట్’ కార్యక్రమం ప్రజాస్వామ్య బలోపేతానికి దోహదపడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ టాలెంట్ హంట్ పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి  సామాజిక న్యాయం పట్ల నిబద్ధత కలిగిన యువ ప్రతిభావంతులను గుర్తించి, వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ఎంపిక చేయనున్న విభాగాలు

ఈ టాలెంట్ హంట్ ద్వారా పలు విభాగాలలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులను పార్టీ ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల వారు ఈ క్రింది విభాగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ నేషనల్ టాలెంట్ హంట్ కోఆర్డినేటర్ కమ్మగోని చౌదరి గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.