18 August, 2026 | 7:52 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

ఈవీఎం గోదాం భద్రత పటిష్టంగా కొనసాగించాలి

07-05-2026 01:32 AM

వనపర్తి టౌన్, మే 6: జిల్లా కేంద్రంలోని ఈ.వి.యం గోదాము భద్రత పటిష్టంగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం ఆర్డివో కార్యాలయం వెనక ఉన్న ఈవీఎం గోదాము ను నెలవారీ తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, ఆర్డీవో సుబ్రమణ్యంతో కలిసి పరిశీలించారు.

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం నెలవారి తనిఖీలు చేసినట్లు వివరించారు. తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.