24 August, 2026 | 10:37 PM

Breaking News

కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •  

ధ్రువీకరించిన విత్తనాలతో అధిక దిగుబడులు

24-06-2026 01:58 AM

ఏడీఏ శ్రీపాల్

మహాదేవపూర్ జూన్ 23 (విజయక్రాంతి):  రైతులు ఖరీఫ్ సీజన్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడి   సాధించాలని మహాదేవపూర్ వ్యవసాయ సంచాలకులు శ్రీ పాల్ అన్నారు. మంగళవారం మండలంలోని  మహాదేవపూర్, సూరారం రైతు వేదికలలో 2026-27సంవత్సరం గాను మహాదేవపూర్ రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన సీడ్ మేళా కార్యక్రమానికి మహాదేవపూర్ సర్పంచ్ హసీనా భాను పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏడీఏ శ్రీపాల్ మాట్లాడుతూ నానో యూరియా నానో డిఏపి ఎరువుల వినియోగం పై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారులు ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించడం వల్ల రైతులు అధిక దిగుబడులు సాధించడంతోపాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బోల్లపెల్లి శ్రీజ.ఏఈవో ధర్మేందర్ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.