ఏబీవీపీ పాఠశాలల బంద్ విజయవంతం
హనుమకొండ, జూన్ 23(విజయ క్రాంతి): విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన పాఠశాల బంద్ హనుమకొండ జిల్లా వ్యాప్తంగా విజయవంతం అయింది. ఉదయాన్నే ఏబీవీపీ నాయకులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను తరగతులు బహిష్కరింపజేశారు.
అనంతరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జూపల్లి దీపిక మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు విద్య నాశనం అవుతున్నాయని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు పోతూ విద్యార్థులను, తల్లిదండ్రులను అలాగే ఇబ్బందుల గురి చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ప్రవేట్, కార్పోరేట్ పాఠశాలలు రోజు, రోజుకు మితి మీరిపోతూ, విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న, నూతన విద్య హక్కు చట్టం తుంగలో తొక్కుతూ విద్యార్థి వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.ఈ రాష్ట్రంలో ఎంఈఓ,డీఈఓ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరెపల్లి సుజిత్ మాట్లాడుతూ కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేట్ కార్పోరేట్ పాఠశాలలు తొత్తులుగా మారి పాఠశాల విద్యను గాలికి వదిలేశారన్నారు.
రేషనల్లైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో తగ్గిస్తానని అనడం సిగ్గుచేటని, దీనిద్వారా పేద,మధ్యతరగతి, బహుజన విద్యార్థులు ప్రాథమిక విద్యను దూరం చేయాలనుకోవడం ముఖ్యమంత్రి దివాలా కోరు తనానికి నిదర్శనం అన్నారు. జాతీయ విద్యా విధానం 2020 ని అమలు చేయాలని, విద్య హక్కు చట్టాన్ని కాపాడాలని, ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు రాహుల్, శ్రీశాంత్, నవీన్, అఖిల్, కార్తీక్, శివ, తదితరులు పాల్గొన్నారు.






