24 June, 2026 | 3:01 AM

సీపీఎస్ రద్దు అధికారం రాష్ట్రాలదే..

24-06-2026 01:59 AM

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ 

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించే సంపూర్ణ రాజ్యాంగబద్ధమైన అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పేర్కొన్నారు.

పాత పెన్షన్ పునరుద్ధరణ అనేది ఉద్యోగుల సామాజిక భద్రతే కాదని, అది రాష్ట్ర ఆర్థిక రంగానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. రాష్ట్రంలోని 2.6 లక్షల ఉద్యోగుల సీపీఎస్‌ను రద్దు చేస్తే రాష్ట్ర ఖజానాకు రూ.20 వేల కోట్లు ఆదాయం సమకూరుతుందన్నారు. ఏపీ తరహాలో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓపీఎస్‌ను అమలు చేస్తూనే సంపూర్ణంగా పాత పెన్షన్ పునరుద్ధరించాలని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన కోరారు.