పంట విత్తనాలతో విత్తన మేళా
ఇబ్రహీంపట్నం, జులై26(విజయక్రాంతి): జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వారి ఆదేశాల మేరకు, వరి పంట కు ప్రత్యామ్నాయంగా ఎల్నినో వాతావరణ పరిస్థితు లను ఎదుర్కొనే ఉద్దేశం తో తక్కువ కాలపరిమితి గల, తక్కువ నీటి వినియోగం తో పoడే పంట విత్తనాల తో ‘విత్తన మేళా’ ను ఉప్పరిగూడ రైతు వేదిక నందు సోమవారం 27th నుండి బుధవారం 29 జులై వరకు 3 రోజుల పాటు నిర్వహించి అవగాహన కల్పించ బడును.
ఈ మేళాలో పెసర, కంది, పచ్చ జొన్న పి ఎస్ పి వై 2 విత్తనాలు, కూరగాయ, గడ్డి విత్తనాలు ఉదయం 11 గం నుండి అందుబాటులో ఉంటాయి. సేంద్రి య వ్యవసాయం లో కంపోస్ట్ తయారీ కి అవసరమైన జీవన ఎరువు ‘ ఫాస్ఫేట్ సోలుబిలైజింగ్ బాక్టీరియా పి ఎస్ బి ‘ సైతం అం దుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు, ప్రజా ప్రతినిధు లు అందరూ పాల్గొని సద్వినియోగం చేయగలరని వ్యవసాయ శాఖ పేర్కొన్నారు.






