దిష్టి కుంభం.. సమాజ శ్రేయస్సు, సుభిక్షానికి ప్రతీక
27-07-2026 12:08 AM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, జూలై 26, (విజయ క్రాంతి): ఆషాఢమాసం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన దిష్టి కుంభం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దిష్టి కుంభం సమాజ శ్రేయస్సు, సుభిక్షానికి ప్రతీక అని ఆయన అన్నారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దాదాపు 55 ఏళ్లుగా ఆర్యవైశ్య సంఘం ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు.






