calender_icon.png 24 May, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసత్య ప్రచారం చేస్తే భూములు స్వాధీనం కావు

21-05-2025 12:00:00 AM

  1. పట్టణ పరిధిలోని సర్వేనెంబర్ 272 భూములు మాకే సొంతం 
  2. పైసలు తీసుకొని పట్టాదారులు మాట తప్పిండ్రు 
  3. ప్రత్యర్ధులు డీజీపీకి ఫిర్యాదు చేసి నాకు మేలు చేసిండ్రు
  4. విలేకరుల సమావేశంలో పట్టణవాసి చలవగాలి రాఘవేంద్ర రాజు 

మహబూబ్ నగర్ మే 20 (విజయ క్రాంతి) : పట్టణ పరిధిలోని నూతన కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్లు 272 భూ ములకు సంబంధించి ప ట్టాదారులకు డబ్బులు ఇచ్చి ఒప్పందం చేసుకోవడం జరిగిందని పట్టణవాసి చలవగాలి రాఘవేందర్ రాజు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పట్టాదారులు పూర్తిస్థాయిలో మాకు పట్టా చేస్తామని హామీ ఇచ్చి ఒప్పందం చేసుకొని డబ్బులు తీసుకొని ఇప్పుడు మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడితే ఎలా సరిపోతుందని అసహనం వ్యక్తం చేశారు. పట్టణం కి చెందిన గోపాల్, మలే శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తులు పట్టాదారులను తప్పుడు సమాచారం ఇచ్చి వారి వైపుకు తిప్పుకుంటున్నారని ఇది సరైన విధానం కాదని ఆరోపించారు.

అన్యాయం చేసి డిజిపి ఆఫీసులో ఫిర్యాదు చేస్తే న్యాయం ఎలా జరుగుతుందని, సర్వహక్కులు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా మించి పోయింది లేదని సవిధానంగా వారు ఆలోచించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లేనియెడల చట్ట ప్రకారం వారికి శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తులు మాటలు నమ్మకూడదని, అసత్య ప్రచారాలు చేసి వారికి జైల్లో దొడ్డు బువ్వ తినవలసి ఉంటుందని స్పష్టం చేశారు.

త్వరలోనే పూర్తిస్థాయిలో న్యాయం గెలుస్తుందని చట్టంపై తమకు నమ్మకం ఉందని తెలిపారు. నాతోపాటు మరో పదకొండు మంది కలిసి రెండున్నర లక్షలు ఇచ్చి ప్లాట్లతోపాటు సర్వేనెంబర్ 270 లో 3 ఎకరాల భూమి కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. కాదని ముందుకు సాగితే పట్టాదారులకు తప్పుదోవ పట్టిస్తున్న వారికి శిక్ష పడుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో శివలింగం గౌడ్, తదితరులు ఉన్నారు.