05-09-2025 12:00:00 AM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి రెవెన్యూ అధికారులు
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 4: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం సుర్మాయిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో కబ్జాకు గురైన 7.28 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి యొక్క విలువ సుమారు రూ. 40 కోట్లు ఉంటుంది.
“విజయక్రాంతి” లో “ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ ప్లాట్లు” అనే శీర్షిక ప్రచురితమైన కథనం స్థానికులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డికి కబ్జాకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుని.. ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని.. కొత్తగా బోర్డు ఏర్పాటు చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమికి కాపాడిని స్థానిక ఎమ్మెల్యేకు, రెవెన్యూ అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.