22 August, 2026 | 2:35 AM

2.80 గ్రాముల డ్రై గంజాయి పట్టివేత

22-08-2026 12:00 AM

శంకర్‌పల్లి, ఆగస్టు 21 (విజయక్రాంతి): గంజాయి తరలిస్తున్న వ్యక్తిని గురువారం రా త్రి మోకిల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ గేటు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా జగన్నాథ్ అనే వ్యక్తి స్పెండర్ ప్లస్ బైక్‌పై వెళ్తుండగా అనుమానం వచ్చి బైకు ఆపి తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగ్ లో 2 కిలోల 80 గ్రాముల డ్రై గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

నిందితుడు ఒడిశా ప్రాంతం నుండి గంజాయిని తీసుకువచ్చి జన్వాడ ప్రాంతంలోని కూలీలకు విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు తెలిసిందని వెల్లడించారు. నిందితుడి వద్దనుండి డ్రై గంజాయితో పాటు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్ ను సీజ్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచడం జరిగిందన్నారు. న్యాయస్థానం ముందు హాజరు పరచగా నిందతుడికి రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ సురేష్ గౌడ్ తెలిపారు.