27-05-2025 07:04:10 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలో మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్ఐ యుగంధర్ గౌడ్(SI Yugandhar Goud) ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలు భాగంగా ఐదు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు ఎస్ఐ యుగంధర్ గౌడ్ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు నెంబర్ ప్లేట్లు కలిగి ఉండాలని డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, హెల్మెట్ ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.