హజ్ యాత్ర చాలా పవిత్రమైనది..
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..
హనుమకొండ (విజయక్రాంతి): హైదరాబాద్ హజ్ హౌస్ లో హజ్ కమిటి చైర్మెన్ కుసురు పాషా(Haj Committee Chairman Khusro Pasha) ఆధ్వర్యంలో నిర్వహించిన హజ్ యాత్రీకుల వీడ్కోలు కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నదని, హజ్ యాత్ర చాలా పవిత్రమైనదని హజ్ యాత్రికులకు ప్రత్యేకమైన రాయితీ ప్రభుత్వం తరపున అందిస్తున్నదని, ఇట్టి అవకాశాన్ని మైనార్టీ సోదరులు వినియోగించుకోవాలని కోరారు. అంతకు ముందు హజ్ యాత్రకు వెళ్లే అందర్నీ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అబూబకర్, అడ్వకేట్ ముదస్సార్, బియబాని, వరంగల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు అజిజ్ మీర్జా బేగ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






