calender_icon.png 10 May, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువవికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తవ్వాలి

10-05-2025 02:22:49 AM

  1. జూన్ 2న మంజూరుపత్రాలు పంపిణీకి సిద్ధం చేయండి
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  3. రాజీవ్ యువవికాసం పురోగతిపై సమీక్ష 

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసానికి ముందుగా నిర్దేశించుకున్న క్యాలెండర్ ప్రకారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న యువవికాసం మంజూరు పత్రాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం రాజీవ్ యువవికాసంపై సంబంధిత ఉన్నత అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షించారు.

పథకా నికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలని, ఈనెల 15 నుంచి 25వ తేదీలోగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీలోగా ఎంపికైన లబ్ధిదారులకు సంబంధించిన మంజూరు పత్రాలను సిద్ధం చే యాలని సూచించారు.

ఇందులో ఎలాంటి జా ప్యం జరగకుండా రాష్ర్టస్థాయి ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, మంజూరు పత్రాలను పంపిణీ చేసిన తర్వాత లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చి, పథకాలకు సంబంధించిన గ్రౌండింగ్ చేపట్టాలని భట్టి సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ శరత్, బీసీ వెల్ఫేర్ సెక్రెటరీ శ్రీధర్, డిప్యూ టీ సీఎం కార్యదర్శి కృష్ణభాస్కర్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి తఫ్సీర్ ఇక్బాల్ పాల్గొన్నారు.