calender_icon.png 12 May, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

10-05-2025 02:29:56 AM

  1. ఏ క్షణమైన పేల్చేస్తామని ఈ-మెయిల్ హెచ్చరిక 
  2. తనిఖీలు చేసి, బాంబు లేదన్న అధికారులు 

రాజేంద్రనగర్, మే 9: శంషాబాద్ ఎయిర్‌పోర్టును పేల్చివేస్తామ ని ఆగంతకులు హెచ్చరించారు. ఏ క్షణమైనా బాంబులతో పేల్చివేస్తామని మెయిల్ రావడంతో ఒక్కసా రిగా ఎయిర్‌పోర్టు అధికారులతో పాటు ప్రయాణికులు ఉలిక్కిపడ్డా రు. భారత్, పాకిస్థాన్ మధ్య యు ద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు రావ డం కలకలం రేగింది. శుక్రవారం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అం తర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ ఆగంతకులు విమానా శ్రయ అధికారులకు ఈ--మెయిల్ పంపారు.

అధికారులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై, విమానాశ్రయంలోని డిపార్చర్, అరైవల్, పార్కింగ్, రన్ వే, ప్రయాణికుల లగేజీలతో పాటు ఇతర ప్రాంతాలను పోలీసు జాగిలాలు, బాంబుస్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎక్క డా కూడా పేలుడు పదార్థాలు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకు న్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.