06-01-2026 01:16:40 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 5 (విజయక్రాంతి): దశాబ్దాలుగా దండకారణ్యం లో ఉనికి కోసం పోరాడుతున్న చివరి తరం తెలంగాణ మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అంతిమ అవకాశం కల్పించింది. మా వోయిస్టు పార్టీలో ప్రస్తుతం తెలంగాణకు చెందిన వారు కేవలం 17 మంది మాత్రమే మిగిలి ఉన్నారని, వారంతా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే రాష్ట్రం సంపూర్ణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా చరిత్రకెక్కుతుందని డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు ముగిసేలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మావోయిస్టులకు కీలక పిలుపునిచ్చారు. ప్రస్తుతం పార్టీ లో క్రియాశీలంగా ఉన్న తెలంగాణ వారి వివరాలను డీజీపీ గణాంకాలతో సహా వెల్లడించారు. మహిళా మావోయిస్టులు 5 మం ది, కేంద్ర కమిటీ సభ్యులు నలుగురు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు, అండర్ గ్రౌండ్‌లో ఒకరు, ఇతర బాధ్యతల్లో మరొకరు ఉన్నారు.
ఈ 17 మందిపై ప్రభుత్వం మొత్తంగా రూ.2.25 కోట్ల రివార్డు ప్రకటించింది. ఎవరో పట్టిస్తే వారికి రివార్డు ఇవ్వడం కంటే.. మీరే స్వచ్ఛందంగా లొంగిపోతే మీ తల మీద ఉన్న రివార్డు మొత్తాన్ని మీకే అందజేస్తాం అని డీజీపీ ప్రకటించారు. జైలు శిక్షలు లేకుండా, కేసుల సత్వర పరిష్కారంతో పాటు ప్రభు త్వం తరఫున మెరుగైన పునరావాసం కల్పిం చి, సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
తక్షణ సాయం కింద డివిజన్ కమిటీ సభ్యులకు రూ. 5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, ఇతర దళ సభ్యులకు రూ.లక్ష చొప్పున చెల్లిస్తారు. పీఎల్జీఏ బెటాలియన్లో గతంలో 400 మందికి పైగా సభ్యులు ఉండగా, ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం 66కు పడిపోయిందని తెలిపారు.
ప్రస్తుతం అడవుల్లో పరిస్థితులు మావోయిస్టులకు ఏమాత్రం అనుకూలంగా లేవని, వృద్ధాప్యం, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, కనీ సం నడవలేని స్థితిలో ఉండి కూడా పోరా టం పేరుతో అడవిని అంటిపెట్టుకుని ఉండొద్దని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ ఆదరణ పొందడం ఉత్తమ మార్గం అని, అనవసరంగా ప్రాణాలు తీసుకోవద్దని డీజీపీ హితవు పలికారు.