calender_icon.png 13 May, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమిస్టర్ ఫలితాలు విడుద చేయాలి

17-04-2025 12:51:22 AM

  1. నిజాం కాలేజీ విద్యార్థుల డిమాండ్
  2. ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట విద్యార్థుల నిరసన

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16(విజయక్రాంతి) : నిజాం కాలేజీలో డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుద చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బుధవారం నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట బైఠాయించి విద్యార్థుల నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాధాలు చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేయకుంటే ఏప్రిల్‌లో పీజీ ఎంట్రేన్స్ పరీక్షలకు తాము ఎలా హాజరు కావాలని డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రశ్నించారు. తమ జీవితాలతో చెలగాటమాడొద్దని విమర్శించారు. ప్రిన్సిపాల్ రాజీనామా చేయా లని డిమాండ్ చేశారు.