calender_icon.png 17 December, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీ క్రిస్టమస్ సంబరాలు..

17-12-2025 05:53:06 PM

ములకలపల్లి (విజయక్రాంతి): ములకలపల్లి బాప్టిస్ట్ చర్చిలో బుధవారం సెమీ క్రిస్టమస్ వేడుకలను నిర్వహించారు. బైబిల్ కాలేజ్ ప్రెసిడెంట్, ములకలపల్లి పాస్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్ గంటా రమేష్, మండల నాయకులు మేకల వెంకటేశ్వర్లు, పువ్వాల మంగపతి, గ్రామీణ వైద్యులు కొమ్ము నాగరాజు, గరిక శ్రీనివాస్, గోలి సంపత్ కుమార్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. దైవజనులు పాస్టర్ ప్రేమ దాసు అందరికీ ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు బోధనలను వివరించారు. దేవుని కృప అందరికీ అనుదినము ఉండాలని ప్రార్థనలు చేశారు.