‘రాజ్యాంగ పరిరక్షణ, సవాళ్లు’పై సీపీఎం ఆధ్వర్యంలో సెమినార్
ఆలేరు, ఏప్రిల్ 13 : జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గార్ల జయంతి సందర్భంగా ఆలేరు మండల, పట్టణ సిపిఎం కమిటీల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ సవాళ్లు సెమినార్ ను ఆలేరు పట్టణంలో షాది ఖానాలో సోమవారం నిర్వహించారు. ఈ సెమినార్ లో మహమ్మద్ జహంగీర్, కల్లూరి మల్లేశం, రాచకొండ జనార్ధన్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని మా ట్లాడారు.
ఈ దేశాన్ని మతోన్మాదం వైపు మనుధర్మ శాస్త్రాన్ని అవలంబించాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ లు ప్రయత్నిస్తుందన్నారు. భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి మనస్మృతి తీసుకువచ్చి మళ్లీ బ్రాహ్మణీయ అగ్రకుల ఆధిపత్య రాజ్య స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. దానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డం నాగరాజు, ఎం ఏ ఇక్బాల్, మొరిగాడి రమేష్, దూపటి వెంకటేష్, ఇక్కిరి శ్రీనివాస్, చకిలం శ్రీనివాస్, చెన్న రాజేష్, మొరిగాడి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.




