13-11-2025 12:30:36 AM
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి) : ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదు.. వచ్చే ఐదేళ్లు తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది’ అని పీసీసీ అధ్యక్షుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ధీ మా వ్యక్తం చేశారు. సీఎంగా రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌గా తన నేతృత్వంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసిందని బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలను మీడియా ప్రశ్నించగా, ఈ రోజుల్లో రిగ్గింగ్ చేయడానికి సాధ్యపడదని.. అలా చేయడానికి పాత జమానా కాదని మహేష్‌కుమార్‌గౌడ్ సమాధానమిచ్చారు. ఓడిపోతున్నామనే బాధతో బీఆర్ ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారని తెలిపారు. ఎంఐఎం, టీడీపీ కూడా తమకు సహకరించిందన్నారు.
ఓటింగ్ శాతం పెరిగి ఉండా ల్సిందని, నగర ప్రజలు, యువత ముందుకు వచ్చి ఓటు వేయాల్సి ఉండేదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుతో పాటు నాయకులు, పార్టీ కేడర్ డోర్ టూ డో ర్ వెళ్లి కష్టపడ్డారని మహేష్‌కుమార్‌గౌడ్ వివరించారు. బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఫేక్ సర్వేలు పెట్టి ప్రజల్లో గందరగో ళం సృష్టించడానికి ప్రయత్నం చేసిందని విమర్శించారు.
సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం టెంపరరీ గేమ్ మాత్రమేనని, అది శాశ్వాతం కాదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తనతోపాటు బీజేపీ అధ్యక్షుడు ప్రచా రం చేశారని, అదే బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదని ప్ర శ్నించారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఉండదని జోష్యం చెప్పారు. బీహార్‌లోనూ మహాఘట్ బంధన్ గెలుస్తుందన్నారు. డీసీసీ అధ్యక్షుల ప్రకటన ఏ క్షణమైన రావొచ్చన్నారు. కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఇతర పదవులు ఈ నెలఖారులోగా భర్తీ చేస్తామన్నారు.
త్వరలోనే లోకల్‌బాడీ ఎన్నికలు
లోకల్ బాడీ ఎన్నికలు కూడా త్వరలోనే జరగబోతున్నాయని.. హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకెళ్తామని పీసీసీ అధ్యక్షుడు తెలిపారు. మరోసారి ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి ఆ విషయంపై స్పష్టత ఇస్తామన్నా రు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని అనుకున్నామని.. కానీ కేంద్రంలోని బీజేపీ అడుగడుగునా అడ్డు పడుతోందని విమర్శించారు.
బీసీలు బాగుపడొద్దన్న వైఖరితోనే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో తుఫాన్ వల్ల రైతుకు తీవ్ర నష్టం జరిగిందని, కేంద్రం కనీ సం సాయం కూడా చేయలేదని విమర్శించారు. ఓటు చోరీపై త్వరలోనే కమిటీ వే యనున్నట్లు చెప్పారు. కేంద్రం నిఘా వైఫల్యాల వల్లే ఉగ్రవాదుల కుట్రలు జరుగు తున్నాయన్నారు.
మంత్రి పదవిపై ఆశలు లేవు
‘నాకు మంత్రి పదవిపై ఆశలు లేవు. కోరికలు లేవు. పదవీ కావాలని కూడా అడగలేదు. నేను పీసీసీ అధ్యక్షుడిగానే ఉంటాను. ఈ పదవితో సంతృప్తిగా ఉన్నాను. సీఎం రేవంత్‌రెడ్డితో నాకు గ్యాప్ ఉందని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. పార్టీ అధిష్ఠ్టానం ఏ పని చెబితే అది చేయడం నా ధర్మం’ అని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ వాఖ్యానించారు.
తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని మీడియాలో వచ్చిన వార్తలపై మహేష్‌కుమార్‌గౌడ్ స్పందించారు. సీఎంతో పాటు మంత్రులు, పార్టీ నేతలందరూ పూర్తి గా సహకరిస్తున్నారని, మంత్రివర్గ విస్తరణ సీఎం, పార్టీ అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు.