16-12-2025 06:57:10 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత అంతటి రాయలింగు సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. అంతటి రాయలింగు గౌడ్ దివంగత మాజీ సర్పంచ్ గరిగే మధురయ్య సర్పంచ్ గా ఉన్న సమయంలో ఉప సర్పంచ్ గా 11 సంవత్సరాలు పదవి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎన్నోసార్లు వార్డు సభ్యులుగా పనిచేసి ప్రజలకు సేవ చేశారు.
పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తండ్రి అంతటి రాయలింగు గౌడు ఇక లేరన్న వార్తతో సుల్తానాబాద్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాంగ్రెస్ వాదిగా అంతటి రాయలింగు ప్రస్థానంతో సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి జీవం పోశాడు. ప్రజలకు సేవలు అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు కుటుంబ సభ్యులకు సంతాపం వెలుబుచ్చారు. మంగళవారం జరిగిన ఆయన అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే విజయ రమణారావు సంతాపం..
పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తండ్రి రాయలింగు గుండెపోటుతో మృతిచెందగా మంగళవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రాయలింగు మృతదేహంపై పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.