13 July, 2026 | 4:21 AM

వారి వేదన మరింత కుంగదీసింది

12-12-2024 12:00 AM

కెరీర్ పరంగా డౌన్‌లో ఉన్న ప్రముఖ నటుడు బాబీ డియోల్.. ‘యానిమల్’ చిత్రం తో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ఈ సినిమా తరు వాత ఆయన వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు. ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలోనూ అవకాశాలు ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి. తాజాగా తన సోదరుడు సన్నీడియోల్‌తో కలిసి బాబీ డియోల్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. కెరీర్ విశేషాలతో పాటు అవకాశాలు లేక ఎంత మనోవేదనకు గురయ్యారో బాబీ డియోల్ ఆ కార్యక్రమంలో వివరించారు. “కెరీర్ పరంగా ఒకానొక సమయంలో వరుస పరాజయాలు అందుకోవాల్సి రావడంతో తీవ్రంగా కుంగిపోయాను. నన్ను చూసినా కుటుంబంకూడా తీవ్ర మనోవేదనకు గురవడం నన్ను మరింత కుంగదీసింది. తట్టుకోలేకపోయాను. ఆ సమయంలోనే ఇకపై ఎన్ని సవాళ్లు ఎదురైనా నమ్మకాన్ని వదులుకోకూడదని.. తిరిగి నిలబడాలని నిర్ణయించుకున్నా” అంటూ బాబీడియోల్ కన్నీటిపర్యంతమయ్యారు. సన్నీడియోల్ ఆయనను ఓదార్చారు. ప్రస్తుతం ‘యానిమల్’తో తిరిగి పుంజుకుని వరుస అవకాశాలతో చాలా బిజీగా ఉన్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ‘డాకు మహరాజ్’, ‘హరిహర వీరమల్లు’, ‘హౌస్‌ఫుల్ 5’, ‘ఆల్ఫా’, ‘విజయ్ 69’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.