26-07-2025 12:00:00 AM
ఆర్మూర్, జులై 25 (విజయ క్రాంతి): తండ్రి స్మారకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ అన్నారు. శుక్రవారం మీనుగు లస్మన్న 12వ వర్ధంతి సందర్భంగా అర్మూర్ మండలంలోని చేపూర్ జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ లో అతని కుమారులు రాజ గంగారాం, రాజేశ్వర్ లు విద్యార్థిని విద్యార్థులకు టీ షరట్స్ వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా ఎస్ హెచ్ ఓ హాజరై లక్ష్మన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి చేతుల మీదుగా 110 మంది విద్యార్థిని విద్యార్థులకు సుమారు 35 వేల రూపా యల విలువగల టి షరట్స్ లను అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కుమారులను ప్రయోజకులను చేయడం గొప్ప విషయమన్నారు.
డిఎస్పి హోదాలో ఉన్న పెద్ద కుమారుడు రాజా గంగారాం, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న చిన్న కుమారుడు రాజేశ్వర్ వారి తండ్రి త్యాగాన్ని మరవకుండా ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. రాజేశ్వర్ మాట్లాడుతూ సమాజంలో పదిమందికి సేవ చేస్తున్నామంటే కేవలం మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాకు నేర్పిన నడవడీకేనని అన్నారు.
అందుకే ఈ ప్రక్రియను సేవగా భావించలేదని బాధ్యత గా భావిస్తున్నామని అన్నాడు. ఈ కార్యక్ర మంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయు రాలు చేతన కుమారి, ఉపాధ్యాయులు చంద్రకళ, గీతాంజలి, రవి, గంగాధర్, తాజా మాజీ సర్పంచ్ ఇందుర్ సాయన్న, సమాజ సేవకుడు గడ్డమీది లింగం గౌడ్, మాజీ ఎంపీటీసీ జన్నెపల్లి గంగాధర్, వీడీసీ అధ్యక్షుడు సారంగి శ్రీకాంత్, మాజీ ఉపసర్పంచ్ డిష్ రాజు, డాక్టర్ శంకర్ దాస్, చిట్యాల పోశెట్టి, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.