calender_icon.png 26 July, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయం సరే.. వసతుల మాటేమిటి?

26-07-2025 12:00:00 AM

  1. బస్సులు సరిపోక ప్రయాణికుల ఇక్కట్లు
  2. బస్ సెంటర్లపై దృష్టి పెట్టని టీజీ ఆర్టీసీ

నిర్మల్, జూలై 25 (విజయక్రాంతి): ప్రయాణికుల సౌకర్యమే ప్రథమ కర్తవ్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీజీ ఆర్టీసీ మహాలక్ష్మి పథకంతో ఆదాయ వనరులు పెరిగిన వసతుల కల్పనలో నిర్లక్ష్యాన్ని వహిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదిలాబాద్ నిర్మల్ బైంసా ఉట్నూర్ మంచిర్యాల్ ఆస్పభ జిల్లాలు ఉండగా మొత్తం 616 బస్సులను నడిపిస్తున్నారు. ఇందులో 32 ఆర్టీసీ బస్సులు కాగా 294 అద్దె బస్సులు ఉన్నాయి.

ఇందులో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ డీలక్స్ సెమి లగ్జరీ సెమి డీలక్స్ రాజధాని లహరి బస్సులు ఉండగా ప్రతిరోజు 2.40 లక్షల కిలోమీటర్లను తిప్పుతున్నాయి. ప్రతిరోజు 2.70 లక్షల మందిని రవాణా చేస్తున్న టీజీ ఆర్టీసీ అందులో మహాలక్ష్మి పథకంలో ఉచిత ప్రయాణం మహిళల సంఖ్య 80 శాతం ఉండగా పురుషుల శాతం 20 ఉన్నట్టు పీజీ ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో మహాలక్ష్మి పథకం కంటే ముందు సగటున ౧.౫౦ లక్షల మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తుండగా అది 2.70 లక్షలకు పెరిగినట్టు అధికారులు తెలిపారు. డిపోల మాదిరిగా ఆదాయం పరిశీలిస్తే నిర్మల్ డిపోలో 24 లక్షలు ఉన్న ఆదాయం 40 లక్షలు ఆదిలాబాద్ లో 19 లక్షల ఉన్న ఆదాయం 35 లక్షలు మంచిర్యాలలో 28 లక్షల ఉన్న ఆదాయం 44 లక్షలు, 

ఆసిఫాబాద్ లో 12 లక్షలు ఉన్న ఆదాయం 20 లక్షలకు బైంసా ఉట్నూర్ లో కూడా ఆదాయం భారీగా పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా లో మహాలక్ష్మి పథకంలో రీజియన్ మొత్తం లో 10.39 కోట్ల మహిళలు ప్రయాణం చేయగా  348.80 కోట్ల లబ్ధి పొందినట్టు అధికారులు వెల్లడించారు

వసతుల మాటేమిటి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీజీ ఆర్టీసీకి మహాలక్ష్మి పథకంతో ఆదరణ పెరిగిన ప్పటికీ సౌకర్యాల కల్పనలో అధికారులు తగిన చర్యలు కల్పించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినవస్తున్నాయి. నిర్మల్ బైంసా ఆసిఫాబాద్ ఉట్నూర్ ప్రాంతాల్లో కాలం చెల్లిన బస్సులను తిరిగి రద్దీ కారణం గా చిన్న చిన్న మరమత్తులతో నిర్వహిస్తున్నారు. బస్సులు నిర్మలకు 3346 మంది ఆర్టీసీ కార్మికులు పనిచేస్తుండగా ఇందులో ప్రతినెల రిటైర్మెంట్ అవుతున్న కొత్త ఉద్యోగాల నియామకం చేపట్టడం లేదు.

ఆర్టీసీ కిలోమీటర్లను ట్రిప్పులను గణనీయంగా పెంచడంతో ఉన్న సిబ్బందిపై ఒత్తిడి గురవుతున్నారు. ఏ బస్సు చూసిన ప్రయాణికులతో రద్దీగా ఉండడంతో విధు లు నిర్వహించే ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు వి ధులను భారంగా నిర్వహిస్తున్నట్టు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ప్రతి పెరగడంతో ఈ బస్సులో కూడా మహిళలకు వృద్ధులకు బాలింతలకు సీట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బస్సుల సంఖ్య పెంచితే కానీ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండదని ప్రజలు పేర్కొం టున్నారు. 

బస్సుల సంఖ్య పెంచాలి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో బస్సుల సంఖ్యను పెంచవలసిన అవసరం ఉందని ప్రజలు ఆర్టీసీ కార్మికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం టీజీ ఆర్టీసీ ద్వారా నడపబోతున్న బస్సుల సంఖ్య ప్రయాణికుల డిమాండ్ మేరకు సరిపోకపోవడంతో కొన్ని రూట్లలో జనం రద్దీ పెరిగి ఆర్టీసీ బందీ ప్రజలు నానా ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పనపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు