calender_icon.png 13 January, 2026 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ సర్పంచ్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

13-01-2026 12:00:00 AM

మేడ్చల్ అర్బన్, జనవరి 12(విజయ క్రాంతి): మేడ్చల్ మాజీ సర్పంచ్ రామన్న గారి రాజేశ్వర్ గౌడ్ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు మణికంఠ గౌడ్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు  అన్నదానం చేశారు. పూడూరు గ్రామానికి శీతల శవపేటికను అందజేశారు. రాజేశ్వర్ గౌడ్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు కోల వెంకటేష్, శేఖర్ రెడ్డి, మల్లెల కృష్ణ, తుపాకుల కృష్ణ, దుండిగళ్ల శంకర్, మల్లికార్జున్, మాజీ ఉప సర్పంచ్ మానేపల్లి వెంకటేష్, విట్టల్, డప్పు కృష్ణ, ప్రభాకర్, శేఖర్, బాలకృష్ణారెడ్డి, కృష్ణా తదితరులు పాల్గొన్నారు.