02-06-2025 07:27:47 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) పోలీసుల గౌరవ వందలను స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ సేవలు అందించిన 17 మంది పోలీస్ సిబ్బందికి వివిధ పథకాలను అందించి సమాజంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ శాంతి భద్రతల పర్యవేక్షణ ప్రాధాన్యతను గుర్తించి పోలీస్ శాఖ ఆదిశగా ముందుకు వెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు.