calender_icon.png 14 September, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిషేధిత గుట్కా పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

13-09-2025 10:16:12 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. శుక్రవారం హన్మకొండ ఎస్సై సతీష్, క్రైమ్ టీమ్ రౌఫ్, అశోక్ లు కాకాజీ కాలనీలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఫోజె రామ్, దశరథ్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు బ్యాగులను తనిఖీ చేయగా, వాటిలో సుమారు రూ. 35 వేల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభించాయి. దీంతో పోలీసులు వాటిని, అలాగే రవాణా కోసం ఉపయోగించిన యాక్టివా మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు హన్మకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. ఈ అక్రమ రవాణాపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.